గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన రెండు సర్కులర్ల ను వెంటనే ఉపసంహరించుకోవాలి . గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రతి పాదాన లేకున్నా భారత ప్రభుత్వం భారత ప్రవాసీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం జీతాలు తగ్గించడం చాల బాధాకరమైన విషయం.
స్వదేశంలో సరైన వేతనాలు లేక భార్యా పిల్లలను వదిలి లక్షలు అప్పుచేసి గల్ఫ్ లో పది రూపాయలు సంపాదించుకుంటామని వస్తే ఇప్పటికే ఇక్కడ ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదు ఇలాంటి పరిస్థితి లో వేతనాలు తగ్గించడం చాల అన్యాయం.
ముక్యంగా వేరే దేశాల కార్మికులు గల్ఫ్ కి వస్తే వారి దేశం వారు మాకు ఎక్కువ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తాయి. మన కేంద్ర ప్రభుత్వం మెమో వేతనాలు తగ్గించాలని సర్కులర్ల ను జారీ చేస్తున్నాయి . ఇలా కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల జీవితాలతో వెలుగులు నిప్పే ప్రయాతం చేయాలి గాని , చివరికి గల్ఫ్ కార్మికుల జీవితాల్లో చీకటి చేసే ప్రయత్నం చేస్తున్నది.ఆలా చేస్తేకొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు పైకి వచ్చి బ్రతకాల్సి వస్తుంది.ఇప్పటికైనా వెంటనే సర్కులర్ల నురద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాము.
రాధారపు సతీష్ కుమార్
ప్రెసిడెంట్ ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ .