బిగ్ బాస్ హౌజ్‌లో ఫైనలిస్ట్స్‌తో కలిసి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేసిన రచ్చ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచింది. ఆదివారం రోజు ఫినాలే కాగా, ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్స్‌తో కలిసి కాసేపు సరదగా గడిపే అవకాశం ఇ,చ్చారు బిగ్ బాస్. శుక్రవారం రోజు . మోనాల్, కరాటే కల్యాణి, లాస్య, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ హౌజ్‌లో రచ్చ చేశారు.
కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇప్పుడు బయటకు వెళ్లిన హౌజ్‌మేట్స్‌తో మాట్లాడడం కోసం కూడా అలానే గ్లాసు గదని ఏర్పాటు చేశారు. ముందుగా ఇంట్లోకి బిగ్ బాస్ దత్త పుత్రిక మోనాల్ ఎంట్రీ ఇవ్వగా, ఆమెను చూడగానే అఖిల్, సోహైల్ ఉరుక్కుంటూ వచ్చారు. అద్దాలు ఉన్న వారి హగ్గులకి అడ్డంకిగా మారలేకపోయాయి. అందరితో హగ్గులు, కిస్‌లు ఇవ్వడం అయిపోయాక మోనాల్.. అఖిల్‌ని చాలా మిస్ అవుతున్నట్టు పేర్కొంది. రాత్రి నిద్ర పట్టడం లేదు అని మోనాల్ అంటే నాకు కూడా అలానే ఉందని అఖిల్ పేర్కొన్నాడు. ఇక అభిజీత్ .. మోనాల్‌ని చూసి సూపర్‌గా ఉన్నావ్ అంటూ సైగ చేశాడు.
మీరందరు బాగా ఆడుతున్నారు, బయట మీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంటూ మోనాల్ హౌజ్‌మేట్స్ కు ధైర్యం నూరిపోసింది. అఖిల్ నీ డ్రీమ్స్ నెరవేరాలి, నువ్వే నెంబర్ వన్ అంటూ గాల్లోకి బెలూన్స్ వదిలింది. ఇక అభిజీత్ నీ ఫ్యూచర్ బాగుండాలి. అరియానా నిన్ను చూస్తే జలస్ వస్తుంది. నీతో ఫ్రెండ్షిప్ మరింత పెరగాలి. సోహైల్ నువ్వు బిగ్ బాస్ విజేత కావాలి అంటూ అందరికి చివరిగా ఓ హగ్ ఇచ్చి హౌజ్ నుండి నిష్క్రమించింది.