ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 506 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 63,873 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 506 మంది వైరస్ బారినపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అత్యధికంగా చిత్తూరులో 104, గుంటూరులో 69, పశ్చిమగోదావరిలో 66, కృష్ణాలో 59 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,75,531 మంది కరోనా బారినపడగా, 8,63,508 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం 4,966 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్-19తో మరణించారు. మొత్తంగా మృతి చెందిన వారి సంఖ్య 7,057కు చేరింది. కాగా, జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో 25, విజయనగరంలో 13, కర్నూలులో 28, తూర్పుగోదావరిలో 41, నెల్లూరులో 29, కడపలో 12 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి