Home / HYDERBAAD / జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదల

గ్రేటర్‌ ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదలయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ నిబంధనలు విడుదల చేశారు. నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి.

– పోలింగ్‌ ఏజెంట్‌ అదే ప్రాంత ఓటరు కార్డు కలిగి ఉండాలి

– పోలింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థి ఒక బ్యానర్‌ ఏర్పాటుకు అనుమతి. అభ్యర్థి పేరు, పార్టీ పేరు, ఎన్నికల చిహ్నంతో కూడిన  బ్యానర్‌ ఏర్పాటుకు అనుమతి

– బూత్‌ల ఏర్పాటు కోసం అధికారుల రాతపూర్వక అనుమతి పొందాలి

– బూత్‌లు నిర్వహించే వ్యక్తులు అనుమతి పత్రాలు చూపాలి

– పోలింగ్‌ రోజున కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ప్రచారం చేయకూడదు

– పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్లు పరిధిలో చరవాణులకు అనుమతి లేదు

– పోలింగ్‌ రోజున అభ్యర్థి వార్డు పరిధిలో తిరిగేందుకు ఒక వాహనానికి అనుమతి

– అభ్యర్థుల ఏజెంట్లు, కార్యకర్తల వాహనాలకు అనుమతి లేదు

– అభ్యర్థి పేరుతో ఉన్న వాహనాన్ని ఇతరులు వాడేందుకు అనుమతి లేదు

– పోలింగ్‌ రోజున ఓటర్లను వాహనాల ద్వారా తరలించడం నేరం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat