బీజేపీకి ఒకప్పుడు సిద్దాంతం ఉండేది. నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారింది. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుంది. వారి వ్యవహార శైలిని తెరాస కార్యకర్తలు తిప్పి కొట్టాలి. ఎన్నికలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయి. కానీ ఆ పార్టీలు ఏం చేసాయని ఓట్లు వేయాలి. 70 ఏళ్ప కాంగ్రెస్, బీజేపీ పాలనలో పఠాన్ చెరుకు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేదు. ఆడబిడ్డలు నీటి ట్యాంకర్ల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి. ఎన్నికల్లో మంచి నీటిసమస్య తీరుస్తామని హమీ ఇచ్చి 251 కోట్లతో ఇంటింటికి తాగు నీరు ఇచ్చిన పార్టీ తెరాస. తెరాస వచ్చాక ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లకు పని లేకుండా పోయింది. కోతలులేని నాణ్యమైన విద్యుత్ ఇంటింటికి ఇచ్చి జనరేటర్లు, కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, డిజీల్ ఖర్చు లేకుండా చేసింది తెరాస ప్రభుత్వం. తెలంగాణ ఇస్తే రాష్ట్రం చీకటి గా మారుతుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది ఆనాడు. కాని జరిగిందేమిటి.? కాంగ్రెస్ నేతల జీవితాల్లో చీకటి, ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పఠాన్ చెరులో వారంలో మూడురోజులు పరిశ్రమల్లో పవర్ హాలీడెస్. పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ, తెరాస గెలిచాక 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాతో కొత్త పరిశ్రమలు పఠాన్ చెరుకు వస్తున్నాయి. కార్మికుల ఒ.టీలు వస్తున్నాయి. పఠాన్ చెరులో ఇండస్ట్రియల్ పార్కు,సుల్తాన్ పూర్‌లో మెడికల్ డివైస్ పార్కు, ఉస్మాన్ నగర్ లో 250 ఎకరాల్లో ఐటీపార్కు, శివానగర్ లో ఎల్.ఈ.డీ పార్కు వస్తున్నాయి. వేలాదిమంది యువతకు కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. చంద్రబాబు, వై.ఎస్ హయాంలో పటాన్ చెరుభూములు అమ్మెసారు తప్ప ఒక మార్కెట్ కట్టించలేదు. కానీ, తెరాస అధికారం లోకి వచ్చాక 180కోట్లవిలువైన భూమిలో 15 ఎకరాలలో పది కోట్లతో మంచి మార్కెట్ కట్టడం జరిగింది. పఠాన్ చెరులో స్టేడియం, ప్రతీ డివిజన్ లో ఫంక్షన్ హాలు,ఆడపిల్లల పాఠశాల కూలిపోతే 2 కోట్లతోభవనం, చిన్నవాగి, పెద్దవాగులపై16 ,బ్రిడ్జ్ లు నిర్మాణం చేయడం జరిగింది. డబుల్‌బెడ్ రూం ఇళ్లలో పది శాతం అంటే నాలుగు వేల ఇళ్లు పఠాన్‌చెరు పేదలకు దక్కనున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు అసలు ఓటు ఎందుకు వేయాలి.? ఎన్నికలలో గెలిస్తే వేయి రూపాయల పెన్షన్ ను రెండువేలు చేస్తామని మాట ఇచ్చి, ఎన్నికల్లో గెలవగానే మాటనిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
కాంగ్రెస్ అధికారం లో ఉండి చేసిందేమి లేదు. ఇవాళ అధికారం లేని కాంగ్రెస్ చేసేదేమి లేదు. కరోనా కష్ట కాలంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు భయపడి ఇళ్లలో ఉండి బయటకే రాలేదు. మేం కరోనా బాధితుల తలుపు తట్టి మందులు, వైద్యసేవలు అందేలా చూశాం. ఆ రెండు పార్టీల్లా ప్రజలు కష్టాల్లో ఉంటే ఇంట్లో కూర్చోలేదు. ప్రజలకు అండగా ఉన్నాం. బీజేపీ కరోనా తో కూడా రాజకీయాలు చేస్తోంది. బీహార్ ఎన్నికలలో గెలవడానికి మేం గెలిస్తే బీహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ప్రచారం చేసింది. తెలంగాకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వరా.. ? హైదరాబాదు ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వరా.. ? బీజేపీది దిగజారుడు రాజకీయం. కాంగ్రెస్ ఏం చేసింది.. ? బీజేపీ ఎం చేసింది. ? అనే విషయాలు , తెరాస గెలిచాక చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెరాస కార్యకర్తలు గడప, గడపకు ,గుండె, గుండెకు తీసుకెళ్లాలి.
జీవో 58, 59 కింద ఉచితంగా పఠాన్ చెరులో పేద ప్రజలకు పట్టాలిచ్చాం. సీఎం కేసీఆర్ కరోనాను దృష్టిలో పెట్టుకొని ఆస్థి పన్నును 50, శాతం తగ్గించి ఊరట నిచ్చారు. తెరాస ప్రభుత్వ కార్యక్రమాలు గడప గడపకు తీసుకెళ్లాలి. సోషల్ మీడియా లోనూ ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీజేపీల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఈ సమావేశంలోఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, ఫారూఖ్ హూస్సెన్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్,అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
Tags bjp elections of ghmc GHMC ghmc elections harish rao tanneeru hyderabad kcr ktr slider telangana governament trs trs governament