మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నిలిచిన ఉద్యమ నేతగా, జన నాయకుడిగా, కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోంమంత్రిగా అందరి మనస్సుల్లో నిలిచిపోతారని మంత్రి కేటీఆర్ అన్నారు.
గురువారం నాయిని మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫొటోలను ట్విటర్లో ఫొటోలు షేర్ చేశారు.
‘జీవితమంతా అణగారిన వర్గాల కోసం పోరాడిన యోధుడని, మీ ఆత్మశాంతికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.