తొలిప్రేమ తాలూకు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా ఉంటాయి. ఎన్నిసార్లు తరచిచూసినా తొలియవ్వనపు రోజుల్లోని వలపుకథలు మధురంగానే అనిపిస్తాయి. హైస్కూల్ రోజుల్లో తన ప్రేమాయణం కూడా అలాంటిదేనని చెప్పింది అగ్ర కథానాయిక కియారా అద్వాణీ.
తొలి ప్రేమ విఫలమైనా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే అనిపిస్తాయని చెప్పుకొచ్చిందీ భామ. ‘ప్లస్ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి అతడిని కలుసుకునేదాన్ని. మరోవైపు చదువును అశ్రద్ధ చేస్తున్నానంటూ నా తల్లిదండ్రులు కోప్పడేవారు.
ఈ సంఘర్షణ నడుమ నా ప్రేమను త్యాగం చేశాను. ఆ సమయంలో నేను మానసిక ఎంతో ఆవేదనకు గురయ్యాను. వయసుపరంగా వచ్చిన పరిపక్వతతో క్రమంగా కోలుకున్నా’ అని చెప్పింది కియారా అద్వాణీ. అరంగేట్రం చేసిన అనతికాలంలో బాలీవుడ్‌లో ఈ సొగసరి అగ్ర కథానాయికగా ఎదిగింది. ‘ధోనీ’ ‘కబీర్‌సింగ్’ చిత్రాలతో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తెలుగులో ‘వినయ విధేయ రామ’ ‘భరత్ అనే అనే’ చిత్రాల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది.