తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన అవినీతి, లంచం కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో నాగరాజు ఉంటున్నాడు. నాగరాజు మృతదేహాన్ని చంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో కోటి పది లక్షల రూపాయాలు లంచం డిమాండ్ చేసిన ఆయన ఏసీబీకి అడ్డంగా చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం లభించడంతో ఆయనను అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు.