లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నటి తాప్సీ కూడా అనురాగ్ కాశ్యప్ కు అండగా నిలిచింది.
సెట్స్ లో అనురాగ్ కాశ్యప్ వైఖరి ఎలా ఉంటుందో..? ముంబై మిర్రర్ కథనంలో చెప్పుకొచ్చింది. అనురాగ్ విలువలు, నిజాయితీతో కూడిన పనితనాన్ని తాప్సీ ప్రశంసించింది. సెట్స్ లో తన చుట్టూ ఉండే మహిళల పట్ల గౌరవప్రదంగా ఉంటారని చెప్పింది.
ఒకవేళ ఎవరైనా వేధించబడితే..వారి ఆరోపణలపై దర్యాప్తు చేయనివ్వండి. విచారణలో నిజమేంటో తెలుస్తుంది. ఒకవేళ అతడు (అనురాగ్ కాశ్యప్) తప్పు చేసినట్టు రుజువైతే..అతనితో అన్ని రకాల బంధాలను తెగతెంపులు చేసుకునే మొదటి వ్యక్తిని తానేనని స్పష్టం చేసింది తాప్సీ.
అంతేకాదు దర్యాప్తు అసంపూర్తిగా ఉంటే మీటూ ఉద్యమం ద్వారా నిజమైన బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది.? ప్రశ్నించింది. కానీ కొందరు మహిళలు హారర్ స్టోరీలతో ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడం సరికాదని వ్యాఖ్యానించింది.