ఆట, కిక్, పోకిరి వంటి చిత్రాలతో కుర్రకారు మనసు దోచేసింది గోవా బ్యూటీ ఇలియానా. ఈ భామ గతేడాది రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ తార ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఓ సరస్సులో తెప్పపై ముందుకు వెళ్తున్న వీడియో ను షేర్ చేస్తూ..నా బాధ్యతల నుంచి పారిపోతున్నా..బై అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఇలియానా. ఈ వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే ఇలియానా చిన్ననాటి ఫొటో షేర్ చేసి ఫన్నీ టైటిల్ ను పెట్టిన ఫొటోను పోస్ట్ చేయగా..నెట్టింట్లో వైరల్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ పై దృష్టిపెట్టిన ఈ సుందరి అజయ్ దేవ్ గన్ నిర్మిస్తోన్న ది బిగ్ బుల్ మూవీలో నటిస్తోంది.
ఇండియాలో 1992లో జరిగిన సెక్యూరిటీస్ స్కాం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్నాడు.