శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది.
తనకు పెళ్లికాలేదని అరెస్ట్ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు.
అజీజ్ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అతడు బెంగళూరులో ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. పోలీసులు సాక్ష్యాలన్నీ చూపడంతో సంజన పెళ్లయిందని ఒప్పుకోక తప్పలేదు.