ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా తగ్గడం లేదు. రాజకీయ, సినీ, క్రీడలకు సంబంధించిన సెలబ్రిటీల జీవిత కథలు సినిమాల రూపంలో తెరకెక్కుతున్నాయి.
తాజాగా ఇండియన్ సినిమాల్లో ఐదు దశాబ్దాల కెరీర్‌తో మూడు వందలకు పైగా సినిమాలు చేసిన దివంగత స్టార్ శ్రీదేవి బయోపిక్‌ను రూపొందించడానికి ఆమె భర్త బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు.
మరి ఈ బయోపిక్‌లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే లేటెస్ట్గా నేను రేసులో ఉన్నాగా! అంటూ కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా లైన్లోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. రీసెంట్గా అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసిన రష్మిక, వారినొక ప్రశ్న వేసింది. శ్రీదేవి బయోపిక్, సౌందర్య బయోపిక్.. వీటిలో నేను ఏది చేస్తే బెటర్? అని అడిగింది. అభిమానులంతా శ్రీదేవి బయోపిక్‌లో రష్మిక చేయాలంటూ ఆన్సర్ ఇచ్చేశారు.
నేను కూడా అదే అనుకున్నానంటూ రష్మిక సమాధానమిచ్చింది. మరి రష్మికను నిజంగానే ఎవరైనా శ్రీదేవి, సౌందర్య బయోపిక్ కోసం సంప్రదించారా? లేక ఆమె మనసులో అనుకుంటుందా? అనే విషయం మాత్రం తెలియడం లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.!