చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న. ప్రేక్షకులకు ఆ రోజున కొత్త సినిమాలో ఆయన లుక్ చూపించనున్నారు. చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ఓ చిత్రం తెరకెక్కుతోంది.
కొరటాల శివ దర్శకుడు. నిరంజన్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. పిడికిలి బిగించి ఎర్ర కండువా పట్టుకున్న చేతిని ప్రీలుక్‌గా మంగళవారం విడుదల చేశారు.
బహుశా… మావోయిస్టుగా చిరంజీవి లుక్ విడుదల చేస్తారేమో? చిత్రంలో ఆయన మావోయిస్టుగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘ఆచార్య’ టైటిల్ ఖరారు చేసినట్టు ఆ మధ్య ఓ సినీ వేడుకలో స్వయంగా చిరంజీవి తెలిపారు. ఆ టైటిల్ కూడా పుట్టినరోజున ప్రకటించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతానికి చిత్రబృందం ‘చిరు152’ అని పేర్కొంటోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్. తిరు, కళ: సురేశ్ సెల్వరాజన్, కూర్పు: నవీన్ నూలి, సంగీతం: మణిశర్మ, సమర్పణ: కొణిదెల సురేఖ.