టీమిండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అంయర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి విదితమే.
అయితే తొలిసారిగా ఎంఎస్ ధోనీ 2004 డిసెంబర్ 23న బంగ్లాపై తొలి వన్డే ఆడాడు.
2005 డిసెంబర్ 2న తొలి టెస్ట్ ఆడాడు. మొత్తం 350 వన్డేలు, 98 టీ20, 90 టెస్టులు ధోని ఆడాడు.
అంతర్జాతీయ వన్డేలో 10,773పరుగులు చేశాడు.ఇందులో10శతకాలున్నాయి.73ఆర్ధసెంచురీలున్నాయి.అయితే వన్డే మ్యాచ్ లో అత్యధికంగా 183 పరుగులు చేశాడు ..
ఇక టెస్టులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు చేశాడు. 2019 జూలై 9న ఎంఎస్ ధోనీ న్యూజిలాండ్ తో చివరి వన్డే ఆడాడు .