మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.. రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది..
వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం.. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని ప్రకటించింది.. ఇక, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఈనెల 10న ప్రణబ్‌కు శస్త్రచికిత్స కూడా జరిగినట్టు వైద్యులు తెలిపారు.
మరోవైపు.. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ. తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు. త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన కోసం మీ ప్రార్థనలకు కొనసాగించండి అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రణబ్ ప్రస్తుతం హీమోడౌనమికల్‌గా స్థిరంగా ఉన్నారని తెలిపారు.
కాగా, ప్రణబ్ ముఖర్జీ అస్వస్థతకు గురుకావడంతో ఈ నెల 10న ఉదయం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే.. అక్కడ పరీక్షల అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఆయనే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..
అంతేకాదు.. గత వారం రోజులుగా తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కూడా సూచించారు ప్రణబ్ ముఖర్జీ.