నటుడు సోనూసూద్. సహాయం చేసిన చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వంనుంచి అందిన సహాయం. వివరాలు
1. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో వేసిన ప్రభుత్వం
2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ.
3. నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం
4. పెద్ద కూతురు జగనన్న తోడు కింద లబ్ధికోసం దరఖాస్తు చేశారు. చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది.
5. నాగేశ్వర్రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్ అందుకుంటోంది.
6. నాగేశ్వర్రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతి నెలా రూ.2,250లు అందుకుంటున్నారు.
7. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వర్రావు కుటుంబం అందుకుంది. ఉచిత రేషన్‌కూడా తీసుకుంది.
8. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలు తీసుకున్నారు.