తెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్లో కరోనా కలకలం రేపుతోంది. రాజ్ భవన్లో భద్రతను పర్యవేక్షించే 28మంది పోలీసులకు, పనిచేసే మరో 10 మంది సిబ్బంది, సిబ్బంది కుటుంబీకుల్లో మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది.
బాధితులనుS.R. నగర్ లో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాజ్భవన్లో మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు చేయగా 347మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.