బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డిప్రెషన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆయన మృతి ఎందరికో తీరని విషాదాన్ని కలిగించింది. సెలబ్రిటీలు, అభిమానులు సుశాంత్ మరణాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ వదిన సుధ..ఆయన మరణాన్ని తట్టుకోలేక సోమవారం కన్నుమూశారు.
సుశాంత్ మరణించాడన్న వార్త తెలిసినప్పటి నుండి సుధా కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టలేదట. ఈ క్రమంలో సుధా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృత్యువాత పడింది. సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే సుశాంత్ వరుస సోదరుని భార్య సుధా దెని బీహార్లోని పూర్ణియాలో కన్నుమూసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సోమవారం సుశాంత్ అంత్యక్రియలు జరిపారు.