దేశ ప్రజలను కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది.
కరోనా నుంచి బయట పడేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కరోనాను పారదోలేందుకు కొందరైతే దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఎవరి విశ్వాసం వారిది.
కేరళలోని కడక్కల్‌కు చెందిన అనిలాన్ అనే వ్యక్తి.. కరోనా వైరస్‌ను దేవతగా ఆరాధిస్తున్నాడు. తన పూజగదిలో కరోనా వైరస్‌ను పోలిన ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి ప్రతి రోజు పూజలు చేస్తున్నాడు. ఈ దేశ ప్రజలను కరోనా నుంచి విముక్తి చెందించేలా చూడాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిని కాపాడాలని కోరుకుంటున్నాడు.
అయితే అనిలాన్ ప్రయత్నంపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి. కరోనా దేవీకి పూజలు చేయడం ఏంటని? ఆయనను ఎగతాళి చేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నాడని కొందరు అంటే.. ఇది పూర్తిగా మూఢనమ్మకమేనని మరికొందరు అంటున్నారు. కేవలం తాను ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అనిలాన్ స్పష్టం చేశారు.