దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో బోధన ఆగస్టు తర్వాత ప్రారంభం కావచ్చని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ ప్రకటించారు.
అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హోంశాఖ అనుమతించిన మీదటే నూతన విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు మొదలుపెడతామని ఆయన స్పష్టం చేశారు.
కొవిడ్-19 పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన అనంతరం మాత్రమే.. ఈ అంశంపై నిర్ణయం సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలలో బోధన కూడా ఆగస్టు తర్వాతనే మొదలుపెడతామని ఆయన తెలిపారు.