ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. జమాల్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవాలాకు గత కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు.
ఆయన రక్త నమూనాలను ఇటీవలే వైద్యులు సేకరించి ల్యాబ్‌కు పంపారు. రక్త నమూనాల ఫలితాలు వచ్చే కంటే ముందు..
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ నిర్వహించిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే ఇమ్రాన్ హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వార్తలు వచ్చాయి.