ఏపీలోని పెన్షనర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.
ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడున్నవారికి అక్కడే ఏప్రిల్ పస్ట్ తారీఖున పెన్షన్ అందిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.ఈ పెన్షన్లని గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఇళ్లకే అందిస్తామని పేర్కొన్నది.
బయోమెట్రిక్,వేలిముద్రలు,సంతకాలు లేకుండానే పెన్షన్లు అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.లబ్ధిదారులకు చెందిన జియో ట్యాగ్ ఫోటోను గ్రామ/వార్డు వాలంటీర్ల తన ఫోన్ ద్వారా తీసుకుంటారని తెలిపింది.