లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో కోడిమాంసం, గుడ్ల సరఫరాపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. మాంసం, చేపల సరఫరాపై ప్రధానంగా చర్చించారు. వీటి రవణాకు జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తమని మంత్రి తలసాని చెప్పారు. ఇందుకు పశు, మత్స్య, పోలీసు, రవాణాశాఖ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి..సమన్వయ కమిటీల ఏర్పాటుకు నోడల్ అధికారిని నియమిస్తమన్నారు.
గొర్రెలు, మేకలు సరఫరా ఆగిపోవడంతో మాంసం ధరలు పెరిగాయని చెప్పారు. అటు అధిక ధరలకు మాంసం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటమన్నమంత్రి.. మాంసం విక్రయించే దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.
అటుకోళ్లు, గుడ్ల సరఫరాకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందన్నారు. దీంతో పాటుగా గొర్రెలు, మేకలు జంట నగరాలకు తీసుకువచ్చి విక్రయించుకోవచ్చని తెలిపిన మంత్రి తలసాని అనుమతుల కోసం కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ యంత్రంగానికి ఆదేశాలిస్తామని చెప్పారు. రవాణా వాహనాలకు తప్పనిసరిగా పోస్టర్లను ఏర్పాటు చేయాలి