‘వరి..కోటి 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు.. అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు హామీ ఇచ్చాం. మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని’ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
40 లక్షల ఎకరాల్లో వరి పంట, 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సిద్ధంగా ఉంది.
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందర పడకూడదు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పంట పండుతుంది. కావునా.. క్రమబద్ధతిలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలి. కూపన్లు ఇచ్చి దాని ప్రకారమే కొనుగోలు చేస్తాం. కూపన్ల పంపిణీ కోసం అగ్రికల్చర్ ఆఫీసర్స్ది ప్రధాన పాత్ర. ఇప్పటికే సమీక్ష జరిపి బాధ్యతలు అప్పగించాం. కూపన్లలో ఉన్న తేదీల ప్రకారమే విక్రయాలు జరుగుతాయి.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 25 వేల కోట్లు సమకూర్చాం.
ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఏర్పాట్లు లేవు. నెలా 15 రోజుల పాటు ధాన్యం కొనుగోలు చేస్తాం. డబ్బులన్ని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. రైతులు సహకరించాలని కోరుతున్నాం. ఊరి ధాన్యం ఎలా పోవాలనేది సమీక్షల ద్వారా చర్చించుకోవాలి. బిహార్ నుంచి హమాలీలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. అనవసరంగా కొనుగోలు కేంద్రం వద్దకు రావద్దు.
పంట కోయడానికి రైతులు హార్వెస్టర్లను సిద్ధం చేసుకోవాలి. ముళ్ల కంచెలు వేయడం మంచిదే కానీ, ఎవరినీ రానీయమంటే మంచిది కాదు. రేషన్ బియ్యం లారీలను అడ్డుకోకూడదని సీఎం కేసీఆర్ వివరించారు.