Home / ANDHRAPRADESH / ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉండిఉంటే..ఆయన ఇమేజ్‌ను ఏ స్థాయిలో పెంచే ప్ర‌య‌త్నం చేసేవారో తెలుసా..?

ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉండిఉంటే..ఆయన ఇమేజ్‌ను ఏ స్థాయిలో పెంచే ప్ర‌య‌త్నం చేసేవారో తెలుసా..?

జాలేస్తోంది… చంద్ర‌బాబు కోల్పోయిన అవ‌కాశాన్ని చూసి.. జాలేస్తోంది.. క‌రోనా కోర‌లు పీకుతున్న జ‌గ‌న్‌ను గుర్తించ‌ని మీడియాను చూసి.. ఏపీ రాజ‌కీయాలు, ఇక్క‌డి మీడియా గురించి జ‌త పుష్క‌ర‌కాలంగా ప‌రిశీలిస్తున్న‌ వ్య‌క్తిగా నాకు తోచింది, నిజంగా ఇదే నిజ‌మ‌ని నేను త‌ల‌చింది ఇక్క‌డ రాసుకుంటున్నాను. పాఠ‌క మ‌హాశ‌యులు అన్య‌ధా భావించ వ‌ల‌దు.అదేగ‌నుక‌…ఇప్పుడు మ‌న రాష్ట్రానికి ముఖ్య‌మంత్రివ‌ర్యులుగా శ్రీమాన్ చండ్ర ప్ర‌చండ చంద్ర‌బాబుగారు గ‌నుక ఉండి ఉంటే మీడియా ఏ రీతిన వీర‌విహారం చేస్తూ ఉండేదో తెలుసా..? క‌రోనా వైర‌స్ ను ఆస‌రా చేసుకుని బాబుగారి ఇమేజ్‌ను ఏ స్థాయిలో పెంచే ప్ర‌య‌త్నం చేసేదో తెలుసా..?

చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రానికి సీఎంగా ఇప్పుడు ఉండి ఉంటే వ‌ంద క్రేన్‌లు, ల‌క్ష జాకీలు క‌లిసినా సాధ్యం కానంత ఎత్తులో మీడియా బాబును ఆకాశానికి ఎత్తేసేది. బాబు సీఎం అయి ఉండి ఉంటే మీడియాలో క‌థ‌నాలు ఎలా ఉండేవో అనే ఆలోచ‌న మెదిలి… ఇదిగో ఇలా ఉండేది అని చెప్ప‌డానికి నేను ఇప్పుడు ప్ర‌య‌త్నిస్తున్నాను. నా మెద‌డుకు త‌ట్టిన‌ కొన్ని విష‌యాలు ఇక్క‌డ రాస్తాను. దేశవ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో బాబు సీఎంగా ఉండి ఉంటే మ‌న రాష్ట్రంలో ఎన్ని క‌రోనా కేసులు న‌మోద‌య్యేవో చెప్ప‌లేం. ఒక‌వేళ ఇప్పుడు న‌మోదైన‌ట్లుగా కేవలం 8 పాజిటివ్ కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యే ప‌ని అయితే మీడియాలో క‌థ‌నాలు ఇదిగో ఇప్పుడు ఇక్క‌డ నేను రాస్తున్న‌ట్లుగానే ఉంటాయండోయ్‌.. రెడీవ‌న్‌టూ_త్రీ

1.క‌రోనాపై విజ‌యం.. బాబును చూసి క‌రోనా వైర‌స్‌లో వ‌ణుకు

2.బాబు చ‌ర్య‌ల వ‌ల్ల‌నే క‌రోనాపై గెలుపు

3.గ్రామ‌వాలంటీర్ల ఆలోచ‌న బాబుగారి మ‌న‌వ‌డు దేవాన్షుదే. ఈ విష‌యంలో ఈ రాష్ట్ర ప్ర‌జ‌లంతా దేవాన్షుకు రుణ‌ప‌డి ఉంటారు.

4.దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. బాబుగారు క‌రోనాపై ఎలా విజ‌యం సాధించారా అని ఆలోచిస్తోంది.

5.వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ బృందం ఏపీ రాక నేడే. ఇక్క‌డ క‌రోనాపై ఎలా గెలిచారో తెలుసుకునేందుకు వ‌స్తున్న డ‌బ్య్లు హెచ్‌వో బృందం.

6.ప్ర‌ధాని మోదీ నుంచి చంద్రబాబుకు ఫోన్. కేవ‌లం ఎనిమిది కేసులే న‌మోద‌వ‌డంపై ఆరా. ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా స‌ల‌హాలు ఇవ్వాలని కోరిన మోదీ.

7.క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రం ఒక క‌మిటీని నియ‌మించే అవ‌కాశం. క‌మిటీ చైర్మ‌న్ గా ప‌రిశీల‌న‌లో చంద్రబాబు పేరు

8.రాష్ట్ర ప్ర‌భుత్వానికి దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎస్‌ల లేఖ‌లు. ఏపీలో క‌రోనాను ఎదుర్కొంటున్న తీరును త‌మ‌కూ వివ‌రించాల‌ని విన‌తి.

9.హ‌ర్యానాలో 14, పంజాబ్‌లో 25 క‌రోనా కేసుల న‌మోదుపై కేంద్రం సీరియ‌స్‌. మీ కంటే పెద్ద రాష్ట్ర‌మైన ఏపీ ని చూసి నేర్చుకోండంటూ హిత‌వు. చంద్ర‌బాబు బాగా ప‌నిచేస్తున్నారంటూ పీఎం మ‌రోసారి కితాబు.

10.పొరుగు రాష్ట్ర‌మైన ఏపీని చూసి నేర్చుకోవాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రం అక్షింత‌లు

11.మేం ఏపీకి వెళ‌తాం. మాకు అనుమ‌తివ్వండిః బాబు పాల‌న‌లోనే మేం సుర‌క్షితం ః కేసీఆర్‌కు లేఖ రాసిన తెలంగాణ‌లోని రెండు జిల్లాల ప్ర‌జ‌లు.

12.అధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్న లోకేష్‌. క‌రోనా వ్యాప్తి కాకుండా వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షిస్తున్న భావి సీఎం లోకేష్‌

13.ఏపీలో 8 కేసులు మాత్ర‌మే న‌మోద‌వ‌డంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆరా.. ఈ రోజు సాయంత్రం సీఎం బాబుతో ఫోన్‌లో మాట్లాడే అవ‌కాశం.

ఇప్పుడు చెప్పండి. బాబును ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఆకాశానికి ఎత్తే మీడియాను చూసి జాలిప‌డాలా.. వ‌ద్దా.. మీరు వంద చెప్పండి.. ఒక గొప్ప అవ‌కాశాన్ని మాత్రం మీడియా కోల్పోయిందండి.

#వాస్త‌వానికి… క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకుంటున్న చ‌ర్య‌లు ఏపీ ప్ర‌జ‌లకు వ‌రంగా మారాయి.

1.సీఎం జ‌గ‌న్ నెల‌కొల్పిన‌ గ్రామ వాలంటీర్లు, స‌చివాల‌య ఉద్యోగుల వ్య‌వ‌స్థ విదేశాల నుంచి వ‌చ్చిన వ్య‌క్తుల వివ‌రాల‌ను జ‌ల్లెడ ప‌ట్టింది.

2.విదేశాల నుంచి వ‌చ్చిన వారంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యేలా ఈ వ్య‌వ‌స్థ విజ‌య‌వంతంగా ప‌నిచేస్తోంది. విదేశాల నుంచి వ‌చ్చిన వారి ఇళ్లను నిరంత‌రం స‌చివాల‌య ఉద్యోగులు, ఏఎన్ ఎంలు, ఆశా వ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీ సిబ్బంది, పోలీసులు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

3. అనుమానితులు ఇళ్ల‌ల్లోనే ఉండేలా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

4.గ‌డిచిన 3 నెల‌ల కాలంలో విదేశాల నుంచి ఏపీకి వ‌చ్చిన వారి వివ‌రాలు చిరునామాతో స‌హా ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్నాయి.

5.అందుకే ఏపీలో విదేశాల నుంచి వ‌చ్చిన వారికే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి త‌ప్ప కొత్త‌గా ఒక్క‌టి కూడా ఎక్క‌డా న‌మోదు కాలేదు.

6.వాస్త‌వానికి ఎన్నిక‌ల వాతావ‌ర‌ణంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి విపత్తును ఎదుర్కొన‌డానికి చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చేది. వైఎస్ జ‌గ‌న్ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల వ‌ల్ల ఏపీ క‌రోనాను దీటుగా ఎదుర్కొంటోంది.

7.ఏపీలో ఎన్ ఆర్ ఐలు ఎక్కువ‌. విదేశాల్లో చ‌దువులు, ఉద్యోగాలు చేసేవారిలో ఏపీ నుంచే ఎక్కువ మంది ఉంటారు. గ్రామ గ్రామాన ఎన్ ఆర్ ఐలు ఉన్నారు. అయినా స‌రే క‌రోనా ఏపీలో మిగిలిన ప్రాంతాల‌తో పోలిస్తే క‌ట్ట‌డిలో ఉందంటే కార‌ణం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లే.

8.హోం క్వారంటైన్లు ప‌క్కాగా అమ‌లు చేయ‌డం, ఐసోలేష‌న్ సెంట‌ర్లు అందుబాటులోకి తీసుకురావ‌డం, మందులు, ఆస్ప‌త్రుల‌ను సిద్ధంగా ఉంచ‌డం, పోలీసులు, ఇత‌ర ప్ర‌భుత్వ అధికార యంత్రాంగాన్ని మొత్తం అందుబాటులో ఉంచ‌డం, జ‌న‌తా క‌ర్ఫ్యూను పూర్తి స్థాయిలో విజ‌య‌వంతం చేయ‌డం జ‌గ‌న్ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు.

జాలేస్తోంది.. ఇంత శ్ర‌మిస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను మీడియా ప‌ట్టించ‌కోక‌పోవ‌డాన్ని చూసి… బాధేస్తోంది..ఇంత చేస్తున్నా ఏపీ క‌ష్టాన్ని దేశానికి చూప‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న మీడియాను చూసి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat