తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ” అమెరికా లాంటి పెద్ద దేశంలోనే పరిస్థితులను అదుపు చేయడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారు..దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్మీని రంగంలో దింపి లాక్ డౌన్ పరిస్థితులను విజయవంతం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి మరి చెబుతున్న అలాంటి పరిస్థితులను తెచ్చుకోవద్దు.మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి స్మూత్ గా చెబుతున్నాం.మాట వినకపోతే ఆర్మీని రంగంలోకి దించుతాం.అవసరమైతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ జారీచేస్తామని హెచ్చరించారు.అయితే సీఎం కేసీఆర్ ఇలా అనడానికి చాలా పెద్ద కారణం ఉందని అంటున్నా రు విశ్లేషకులు.
ఇప్పటికే ప్రపంచానికి పెద్దన్నలాంటి అమెరికా దేశాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తుంది.అది ఇప్పుడు తెలంగాణలో విస్తరిస్తే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది.ప్రజలందరూ తీవ్ర కష్టాలను ఎదుర్కుంటారనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా స్మూత్ గా వార్నింగిచ్చారు.
అంతే కాకుండా లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపైకి తమకు ఏమి పట్టనట్లు వ్యవహరించడంతో కూడా దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు..