కరోనా విజృంభణపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలకు మనవి చేస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నప్పుడు రోడ్డు మీద తిరుగుతాను అంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా యూత్ బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తూ రోడ్ల మీదకు వస్తున్నారని తెలిపారు. యువకులు బైక్ ల పై తిరుగుతూ వారి బాధ్యతను మరిచిపోతున్నారని, మేము అడిగితే హాస్పిటల్, టాబ్లెట్స్ అంటూ అబద్ధాలు చెబుతున్నారని ఇది కరెక్ట్ కాదంటున్నారు. మీరు ఎవర్ని మోసం చేస్తున్నారు.. ఇటలీ లాంటి పరిస్థితులు మనకు వద్దని కోరుతున్నారు. లాక్ డౌన్ పాటిస్తూ పోలీసులకు, అధికారులకు సహకరించాలని, కుటుంబసభ్యులతో ఇంత హ్యాపీగా గడిపే రోజులు మళ్లీ రావు కాబట్టి యువకులు బాధ్యత మరచి అనవసరంగా రోడ్ల మీదకు వస్తే క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త పడి పిల్లల్ని ఇంట్లో ఉండేలా చూడాలి కోరుతున్నారు.
Tags carona effect lokdown telugu states