కరోనా భయాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తత ప్రకటించాయి. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు ఈ నెల 31 వరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా మేఘాలయా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక్కరోజుపాటు పూర్తిగా ప్రజా రవాణాపై ఆంక్షలు విధిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. మార్చి 20 అర్ధరాత్రి నుంచి మార్చి 21 అర్ధరాత్రి వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని తెలిపింది. దాంతోపాటు దుకాణాలు, మార్కెట్లు మూసేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతామని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా 209 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారు.
Tags bus caron effect megalaya stop
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023