తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభలకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుంది.కరోనా కట్టడి చర్యల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిచెందిన దేశాలకంటే ముందంజలో ఉన్నదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రశంసించింది.
ఢిల్లీ, బెంగళూరు, ముంబై కంటే హైదరాబాద్‌లోనే వ్యాధి నివారణ చర్యలు భేషుగ్గా ఉన్నాయని ఆయుష్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ పీవీవీ ప్రసాద్, రిసెర్చ్ అధికారి డాక్టర్ సాకేత్‌రాం తిగుళ్ల కొనియాడారు.
‘అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్‌కార్డు ఉంటేనే కొవిడ్-19 పరీక్షలు చేస్తున్నారు. కానీ ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని మోస్తున్నది. హైదరాబాద్‌కు ఎంతోమంది విదేశీయులు వస్తుంటారు. వారిని పరీక్షించేందుకు కేంద్రాలు ఏర్పాటుచేశారు.
రిపోర్టులు 24 గంటల్లోపే వస్తున్నాయి. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా వంటి దేశాలకంటే తెలంగాణ ప్రభుత్వమే ముందుగా స్పందించింది. ఈ అప్రమత్తత వల్లే స్థానికు లెవరీ కరోనా పాజిటివ్ రాలేదు. విదేశాల నుంచి రాష్ర్టానికి వచ్చినవారిలోనే ఆ లక్షణాలు కనిపించాయి’అని అన్నారు.