ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. మరోపక్క మొత్తం ఆపే శక్తి లేనప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం మన భాద్యత అని చెప్పాలి. ఈ మేరకు హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు కరోనాపై వినూత్న ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తమవంతుగా ప్రజలను చైతన్యపరిచేందుకు చర్యలు చేపట్టారు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ను నిలిపి కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలు మైకులో వివరించారు. ముఖ్యంగా చేతులు కడుక్కునే విధానాన్ని అభినయించి చూపారు. జాగ్రత్తలు పాటిస్తే కరోనాను దూరంగా ఉంచడం సాధ్యమేనని చాటిచెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.
కరోనాపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం. || Dharuvu TV.#Share #Like
Publiée par Dharuvu sur Jeudi 19 mars 2020