కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న సంగతి విదితమే.
తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనుకూలమైన ప్రాంతాల్లో ఒకటి అయిన ఆర్టీసీ బస్సులలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా ప్రతి బస్సులోనూ శానిటైజర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది ప్రభుత్వం.
బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో పాటుగా శానిటైజర్ ను కూడా అందించేలా ఏర్పాట్లు చేసింది. ఇటు ప్రయాణికులకు కూడా కండక్టర్లకు అందరూ సహాకరించాలని.. శానిటైజర్లతో తమ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించింది.