కరోనా ప్రభావంతో దేశం మొత్తం స్కూల్స్, కాలేజీలు, మాల్స్, పార్కులు ఇలా జనసంచారం ఉన్న అన్నీ మూసేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతకుముందే ఎక్కువ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో స్కూల్స్ కి బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి బంద్ ప్రకటించడంతో పరీక్షలు ఆగిపోవడంతో 8వ తరగతి విద్యార్ధులు వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ అవుతారని అడిషనల్ చీఫ్ సెక్రటరీ రేణుక కుమార్ ప్రకటించారు. అంతేకాకుండా మంగళవారం జరిగే పరీక్షలు అన్నీ వాయిదా వేసారు. మరోపక్క ఏప్రిల్ 2 వరకు అన్ని విద్యాసంస్థలు మూసేసారు. అంతేకాకుండా ఇక్కడ 13కేసులు నమోదు అయ్యాయి.
Tags exams pronmotions schools students uttar pradesh
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023