Home / ANDHRAPRADESH / కరోనాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్… సీఎం జగన్ అత్యవనసర సమావేశం…!

కరోనాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్… సీఎం జగన్ అత్యవనసర సమావేశం…!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్‌ -19) ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను సైతం భయపెడుతోంది. తాజాగా తెలంగాణలో కరోనాను కట్టడి కోసం విద్యాసంస్థలు బంద్‌ చేయడంతో అటు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇక కరోనా మహమ్మారి ధాటికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఈసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైరస్ ప్రభావంపై ముఖ్య అధికారులతో రివ్యూ నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణపై ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎస్‌ నీలం సాహ్ని, ఆళ్ల నాని, వైద్యశాఖ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే కరో​నాపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్న సీఎం జగన్‌.. వాటిపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా గుర్తించిన వెంటనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే కీలక సూచనలు వెలువడ్డాయి. వాటిని అనుసరిస్తూ.. ఇప్పటికే ఏపీలో మినీ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించిన వైసీపీ సర్కారు.. దాన్ని పూర్తిస్థాయి ఎమర్జెన్సీగా మార్చేందుకు సిద్ధమైంది. కాగా, కరోనావైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా ఆందోళనకర పరిస్థితి లేదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 70 అనుమానిత కేసులు నమోదు కాగా..57 కేసులకు సంబంధించిన పరీక్షల్లో కరోనా లేనట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. మరో 12 నమూనాలకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందని.. ఒక కేసు మాత్రమే పాజిటివ్‌గా నమోదైందని వెల్లడించింది. వైరస్ వ్యాప్తి విషయంలో ఆందోళనకర పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా షట్ డౌన్ విధించడమే ఉత్తమమనే అభిప్రాయం రివ్యూ సహావేశంలో వెల్లడైనట్లు తెలిసింది. అయితే తెలంగాణ తరహాలో ఏపీలో కూడా స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ మాల్స్ , థియేటర్లు షడ్‌డౌన్ చేస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat