దేశ,రాష్ట్ర వ్యాప్తంగా కరోణ వైరస్ పెరుగుతున్న నేపద్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. వైరస్ సోకకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాము అన్నారు.ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదని,దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది అన్నారు. ఈ మేరకు వారంగా టీటీడీ అధికారులు అనేక చర్యలు చేపట్టాము తెలిపారు. తిరుమలని సెక్టార్ లుగా విభజించి,శుభ్రత చర్యలు చేపట్టామని,గదులు కాలి చేసిన వెంటనే పూర్తిగా సుద్ది చేసిన తర్వాత మరోకరికి కేటాయిస్తున్నాము చెప్పారు. అనుమానితును అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేసామని దీనికొరకు కొంత మంది టీటీడీ ఉన్నతాధికారులను నియమిస్తున్నామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కీలక నిర్ణయాలుతీసుకున్నామని ఆయన అన్నారు. అవి చూస్తే..!
*ఒంటిమిట్టలో సీతరామ కళ్యాణం నిర్వహించాలి.
*కరోణ వైరస్ ప్రభావితం వల్లా ఒకే చోట ఆరు గంటలు ఉండటం మంచిది కాదు.
*సీతరాముల కళ్యాణం రద్దు చేసి, లైవ్ ద్వరా కళ్యాణం వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము.
*ముంబాయిలో 5 వతేదిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భుమి పూజ కూడా వాయిదా వేసాము.
*తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాలి.
*అందుకే వాటిని రద్దు చేసి, టైమ్ స్లాట్ ద్వారా దర్శనానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నాము.
*సర్వదర్శనం రద్దు చేసి, చారికి కూడా టైమ్ స్లాట్ కేటాయిస్తాము..
*మంగళవారం నుండి టిటిడి కేటాయించే సమయం లో మాత్రమే దర్శనానికి రాచాలి.
*భక్తులు కూడా టిటిడి సహకరించాలి అని ఆయన అన్నారు.