దేశంలోకరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్.. పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేయనున్నారు.అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం పదోతరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రేపు, ఎల్లుండి కూడా శాసనసభ సమావేశాలు జరగనున్నాయి.