Home / ANDHRAPRADESH / లోకల్ బాడీ ఎలక్షన్లపై ఏపీ డీజీపీ సవాంగ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ !

లోకల్ బాడీ ఎలక్షన్లపై ఏపీ డీజీపీ సవాంగ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ !

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రజాస్వామ్యానికి, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించాలని చూసినా వారిమీద చట్టపరమైన చర్యలు తప్పవు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదు. ఈ అంశంపై రాజకీయ కోణంలో ఆరోపణలు చేయవద్దని, రాజకీయ ఆరోపణల్లోకి పోలీసులను లాగవద్దని పార్టీలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ పార్టీ వారు ఫిర్యాదు ఇచ్చినా తీసుకుంటున్నాం. ఆ ఫిర్యాదుల మీద తక్షణం విచారణ జరుపుతున్నాం. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటున్నాం. ప్రత్యేకించి మాచర్ల సంఘటనపైన చట్టపరంగా ముందుకు వెళ్తున్నాం. ఈకేసులో ఎవరికీ అనుకూలంగా మేం వ్యవహరించలేదు. అలాంటి పక్షపాతానికి తావులేదు. సెక్షన్‌ 307 కింద మేం కేసులు నమోదు చేయలేదని, వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. సత్యదూరం. మాచర్ల ఘటనలో 307 సెక్షన్‌ కింద ఇప్పటికి ముగ్గురిని అరెస్టు చేశాం. వీరుముగ్గురూ ఇప్పుడు గురజాల సబ్‌జైల్లో ఉన్నారు.

 

 

 

కాబట్టి పోలీసుల పాత్రమీద విమర్శలు చేసేవారు శ్రీ బోండా ఉమ, శ్రీ బుద్దా వెంకన్నలను పోలీసు వాహనాల్లో ఎక్కించుకుని వారికి భద్రత కల్పించామన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. అంతేకాక ప్రతిరోజూ రాష్ట్రంలోని అధికార పార్టీనాయకులైనా, ప్రతిపక్ష నాయకులైనా వారికి ఏపీ పోలీసులు పూర్తి రక్షణ, భద్రత కల్పిస్తున్న విషయాన్ని మరోసారి ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. గ్రామాల స్థాయిలో లేదా వార్డుల స్థాయిలో వ్యక్తుల అక్కడ స్థానికుల మధ్య ఉన్న విభేదాలు లేదా వైరాల కారణంగా అక్కడక్కడా ఘర్షణలకు దారితీసిన పరిస్థితులను కూడా వెంటనే చక్కదిద్దాం. సమర్థవంతంగా వ్యవహరించి ఇటువంటి ఘటనలను చాలా తక్కువస్థాయికి తగ్గించగలిగాం. అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటించి, శాంతి భద్రల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని, స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా పూర్తిగా సహకరించాలని, శాంతి భద్రతల విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించబోమని మరోసారి స్పష్టంచేస్తున్నాం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat