ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో ఎక్కడిక్కక్కడ అందరు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ, బెంగళూరులో స్కూల్స్ కు మార్చి నెలాఖరు వరకు సెలవలు ప్రకటించారు. ఇది అలా ఉండగా ఇప్పటికే భారత్ లో కరోనా ఎఫెక్ట్ కు ఇద్దరు చనిపోయారు. ఇక మరోపక్క కర్ణాటక ప్రభుత్వం ఈరోజునుండి వారంరోజులు పాటు థియేటర్లు, పబ్లిక్ ప్లేస్ లు బంద్ చేసారు. ఇక ఈరోజు రాజస్తాన్ లో అక్కడి ప్రభుత్వం స్కూల్స్, థియేటర్లు, పబ్లిక్ ప్లేస్ లు ఇలా రాష్ట్రం మొత్తం నిర్మానుషంగా ఉండేలా ఆర్డర్ పాస్ చేసింది. రానున్నరోజుల్లో ఇదే కొనసాగితే అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుందని భావిస్తున్నారు.
