క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కరోనా దెబ్బకు ఎటూ కాకుండా పోయేలా ఉంది. ఎందుకంటే కేంద్రం తీసుకున్న వీసా ఆంక్షలు పరంగా చూసుకుంటే విదేశీ ఆటగాళ్ళు ఏప్రిల్ 15వరకు రావడానికి కుదరదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీసీసీఐ కట్టుబడి ఉండాల్సిందే. అయితే ఈ శనివారం ముంబై లో బీసీసీ నిర్వహిస్తున్న మీటింగ్ కు అన్ని జట్ల యాజమాన్యాలను రావాలని చెప్పింది. అయితే ప్రస్తుతం వీరిదగ్గర రెండే రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి ఐపీఎల్ ను రద్దు చేయడం..రెండోవది తలుపులు మూసుకొని ఆడుకోవడమే. వీటిపై చర్చించడానికి 14వ తేధీ అనగా శనివారం ముంబై లో నిర్వహిస్తున్నారు.