వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒకలా ఆ తరువాత మరోలా ఉండడం ఆయనకు అలవాటే అనేది 2014 ఎన్నికలు తరువాత ప్రజలకు బాగా అర్ధమయింది. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చంద్రబాబు చేతులెత్తేశారు. దీనిపై స్పందించిన వేణుంబాక “ఎంతకైనా దిగజారతాడు చంద్రబాబు. పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు కులాలు అంటగడతాడు. అధికార పార్టీ సానుభూతిపరులని ముద్ర వేస్తాడు. ఎల్లో మీడియా కమ్మగా సన్నాయి మోగిస్తుంది. ప్రజలు నమ్ముతున్నారని భ్రమ పడతాడు. ఆఖరున నేనెందుకు ఓడానో అర్థం కావడం లేదని శోకాలు పెడతాడు” అని అన్నారు.