తెలంగాణ కోటాలో కాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్ధుల పేర్లను టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఖరారు చేసారు. కే కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తుంది. వీరి పేర్లను నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ తరపున పలువురు నేతలు ఈ సభ్యత్వాని ఆశించినా చివరుకు ఈ ఇద్దరు నేతలవైపే కేసీఆర్ మొగ్గుచూపినట్టుగా తెలుస్తుంది.
