అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే మారుతీరావు అత్మహత్య కేసులో పలు కొత్త అనుమాలు వ్యక్తమవుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో మారుతీరావు కొద్ది రోజుల కిందట వీలునామా మార్చడానికి సంబంధించిన పలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అమృత భర్త అయిన ప్రణయ్ హత్యకు ముందే మారుతీరావు తనకు ఉన్న ఆస్తినంతా తన సొదరుడు పేరుపైనే వీలునామా రాశారు. అయితే ఇటీవల ఈ వీలునామా మార్చి తిరగరాశారు.బెయిల్ పై ఆరు నెలల తర్వాత వచ్చిన మారుతీరావుతో ఆయనకు చెందిన బంధువులు,సోదరులు గొడవపడినట్లు సమాచారం.
మారుతీరావు వలన తమ పరువు పోయింది. తమ పిల్లలకు పెళ్ళిల్లు కావడం లేదు. అని ఇలా పలు విధాలుగా కుటుంబ సభ్యులు,బంధువులు అతనితో గొడవ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవైపు కుటుంబ,బంధువులతో వివాదాలు.. మరో వైపు ప్రణయ్ హత్యకేసు విచారణ చివరి దశకు రావడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాస్తవాలు ఏమిటని పోలీసుల విచారణలో తేలనున్నది.