తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సిఎల్పి నేత మల్లు భట్టి కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగం ఆరంబించడానికి సిద్దం అయ్యారు.
ఆ క్రమంలో రాజగోపాలరెడ్డి అడ్డుపడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారు కావాలని గొడవ చేస్తున్నారని , వారు తన జవాబు వినడానికి సిద్దంగా లేరని అన్నారు.
సభ్యుడిని సస్పెండ్ చేయాలని కెసిఆర్ అన్నారు. ఆ వెంటనే మంత్రి ప్రశాంతరెడ్డి తీర్మానం పెట్టారు. తొలుత రాజగోపాలరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించినా, ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు మల్లు భట్టి, పొడెం వీరయ్య, దళవాయి అనసూయ, శ్రీదర్ బాబు,జగ్గారెడ్డి లను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.