టీడీపీలో ఆయనో సీనియర్ నేత, పాతికేళ్లకు పైగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. చంద్రబాబుతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అంతే కాదు చంద్రబాబు రహస్యాలన్నీ, అవినీతి బాగోతాల గుట్టు అంతా ఆయనకు తెలుసు. అయితే రాజధాని గ్రామాలతో రైతులతో అమరావతి ఆందోళలనలను నడిపిస్తూ…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో పాతికేళ్లుగా చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు. ఇప్పుడు ఎన్టీఆర్ అసలైన వారసుడు జగనే అంటూ కొనియాడుతున్నారు. మరోపక్క సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్న చంద్రబాబును, టీడీపీ నేతలను కడిగిపారేస్తున్నారు. ఇంతకీ ఆ మాజీ తెలుగు తమ్ముడు ఎవరంటారా…ఆయనే మాజీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్రా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఎ రహమాన్. ఇక నుంచి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్నట్లుగా టీడీపీలో ఉన్నంత వరకే తమ్ముడు…బయటకు వస్తే ఎవరినైనా కుమ్ముడే అంటూ చంద్రబాబుకు, టీడీపీ నేతల మీద విరుచుకుపడుతున్నారు.
ఇటీవల జగన్ సర్కార్ అమలు చేస్తున్న మద్యం పాలసీపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్వయంగా చంద్రబాబు మద్యం రేట్లు పెరిగాయా లేదా..అన్ని బాండ్లు దొరుకుతున్నాయా లేదా…ఏదో బలహీనతతో ఓ పెగ్గేసుకునేవాళ్లకు ఈ ఖర్మేంటీ అంటూ ప్రజా చైతన్యయాత్రలో తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా ప్రభుత్వంపై విమర‌్శలు చేశారు. ఇక టీడీపీ నేత బోండా ఉమ…మందుబాటిళ్లతో ప్రెస్ మీట్ పెట్టి…ఏపీలో ప్రముఖ కంపెనీల మద్యం బ్రాండ్లు దొరకడం లేదు..మద్యంపై ప్రతి నెలా 350 కోట్ల జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ పనికిమాలిన ఆరోపణలు చేశాడు. బోండా ఉమ ఆరోపణలపై మాజీ తెలుగు తమ్ముడు రెహమాన్ మండిపడ్డారు. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబును, టీడీపీ నేతలను ఏకి పారేసారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రజాహిత పాలన అందిస్తుంటే సహించలేక బాబు గ్యాంగ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
జే ట్యాక్స్ అంటూ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు…వాటిని దమ్ముంటే నిరూపించగలరా అంటూ చంద్రబాబుకు సవాలు విసిరారు. ఏపీలో మద్యనిషేధాన్ని సీఎం జగన్ దశలవారీగా అమలు చేస్తున్నారని కొనియాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ అసలైన వారసుడు జగన్ అంటూ కితాబు ఇచ్చారు. ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి గద్దె దించి. మద్యనిషేధానికి పూర్తిగా తూట్లు పొడిచిన పెద్ద మనిషి మీరు కాదా అని చంద్రబాబును రెహమాన్ నిలదీశారు.
ఇక గత ఐదేళ్లలో ఏపీలో మద్యాన్ని ఏరులై పారించి, ఏఏ మద్యం కంపెనీ దగ్గర ఎన్ని వందల కోట్లు కమీషన్లు వసూలు చేసిన సంగతి నాకు తెలియదా అంటూ చంద్రబాబును నిలదీశారు. మీ అవినీతి జాతకాలు విప్పి చెప్పమంటారా చంద్రబాబు అంటూ రెహమాన్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇక నుంచి జగన్‌ను జే ట్యాక్స్ అంటూ విమర్శలు చేస్తే గత ప్రభుత్వంలో మద్యం పేరుతో చంద్రబాబుతో సహా ఏఏ టీడీపీ నేత ఎంతెంత ముడుపులు తీసుకున్నారో బయటపెట్టి అందరి బాగోతాలు జనం ముందు పెడతానని రెహమాన్ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. మొత్తంగా టీడీపీలో ఉన్నంత వరకే తమ్ముడు..బయటకు వచ్చా..ఇక ఎవరినైనా కుమ్ముడే అంటూ విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రెహమాన్ చంద్రబాబుకు, టీడీపీ నేతలకు వార్నింగ్‌లు ఇవ్వడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.