కరోనా వైరస్..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎక్కడ చూసినా ప్రజలు భయందోలనకు గురవుతున్నారు. మరోపక్క అగ్రదేశాలు సైతం ఈ వైరస్ కు బయపడుతున్నారు. దాంతో కొన్ని దేశాల్లో భహిరంగ మీటింగ్ లకు అనుమతి నిరాకరించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇప్పటివరకు కొంచెం పర్వాలేదు అనిపించినా రానున్నరోజుల్లో కొంచెం టెన్షన్ తప్పదని చెప్పాలి. ఇప్పటికే 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి ఐపీఎల్ మార్చి నెల చివర్లో ప్రారంభం కానుంది. ఈమేరకు యావత్భారత్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వైరస్ కు సంబంధించి ఎక్కువ జనం కలిసి ఉంటే కష్టమే అని చెప్పాలి. మరి ఈమేరకు ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.