మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన 152వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. దీనికి కొరటాల దర్శకత్వం వహిస్తున్నాడు. కొరటాల చిత్రం అంటే మామోలుగానే ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఇక చిరు సినిమా విషయానికి వస్తే ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోండి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోకాపేటలో జరుగుతుంది. 40రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ చిత్రం విషయంలో సూపర్ స్టార్ మహేష్ గురించే టాక్ అంతా వస్తుంది. అదేమిటంటే ఇందులో 15నిమిషాలు పాటు మహేష్ స్పెషల్ పాత్రలో నటించబోతున్నారట. స్టూడెంట్ పాత్రలో కొరటాల చుపించాబోతున్నాడట. దీనికి మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి మహేష్ భారీగా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అదేగాని జరిగితే సినిమా బడ్జెట్ పై ప్రభావం ఎంతగానో ఉంటుంది భావిస్తున్నారు. దీనికి రాంచరణ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
