వర్షాకాలంలో తడిచి ముద్దవుతారు..చలికాలం వచ్చేసరికి చల్లని గాలులు వీక్షించి ఆనంద పరిమలాల్లో విరజిల్లుతారు. ఇక్కడివరకు బాగానే అనిపిస్తుంది కాని ఇప్పుడే మొదలవుతుంది అసలైన కుంపటి. అదే ఎండాకాలం..సంవత్సరాలు గడిచే కొద్ది ఎండ తీవ్రత పెరిగిపోతుంది తప్ప అస్సలు తగ్గడం లేదు. ఇక ఈ ఏడాది విషయమే చూసుకుంటే జర జాగ్రత్తగా ఉండక తప్పదు. భారత వాతావరణ విభాగం హెచ్చక ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలుస్తుంది.ఇంకా చెప్పాలంటే నడి రోడ్డుపై నిప్పులు వర్షం కురుస్తాది అని చెప్పాలి. ఇక ఎండల తీవ్రత మార్చి 2వ వారం నుంచే మొదలుకానుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
