హెచ్ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘నోకియా 2’ను విడుదల చేసింది. చాలా తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ మరో రెండు వారాల్లో యూజర్లకు లభ్యం కానుండగా దీని ధర రూ.7,465 మాత్రమే.
నోకియా 2 ఫీచర్లు…
5 ఇంచ్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ52 స్ప్లాష్ ప్రూఫ్ టెక్నాలజీ, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.