ఏపీ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా..గత రెండు నెలలుగా రాజధాని గ్రామాల రైతన్నలు టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొంటున్నారు..దీంతో ఎల్లోమీడియా పైత్యం బాగా ముదిరిపోయింది..మహిళల దగ్గరకు వెళ్లి…మైకులు పెట్టి రెచ్చగొట్టి మరీ సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని బూతులు తిట్టిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఎల్లోమీడియా డర్టీపిక్చర్ బయటపడింది. రాజధాని గ్రామాల్లో 2 నెలలుగా తిష్ట వేసుకున్న ఎల్లో మీడియా ఛానళ్ల ప్రతినిధులలో కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు..రాజధాని గ్రామాలకు వెళ్లి , ఆడోళ్లకు ఫోన్లు చేసి వేధిస్తున్నారట, మొన్న ఓ కెమెరామాన్, ఇప్పుడు రిపోర్టర్లు….. మెల్లగా మాట కలపడం, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకుని అక్కడ టీవీ లైవ్ లు పెట్టడం, అదయ్యాక యు ట్యూబ్ లింక్ పంపుతామని ఫోన్ నంబర్ తీసుకోవడం, తర్వాత వారితో ముచ్చట్లు, ముగ్గులోకి దింపడం గత 2 నెలలుగా పచ్చమీడియా కామాంధుల ఆగడాలకు హద్దే లేదు.
అదేంటో రాజధాని గ్రామాల మీద ఆ మూడు ఛానళ్ల కు ఎందుకంత ప్రేమో తెలీదు కానీ, ఆ రిపోర్టర్లు, కెమెరామెన్లకు మాత్రం అదో కామ కార్య క్షేత్రంగా మారిపోయింది. ఉదయాన్నే రాజధాని గ్రామాలకు వెళ్లడం దగ్గర నుంచి, రాత్రి పొద్దుపోయే వరకు ఆందోళనలు జరుగుతున్న ఊళ్లలోనే ఉండటంతో అక్కడి మహిళలతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు తెగ ఉబలాట పడుతున్నారు. ముఖ్యంగా రాజధాని గ్రామాల రక్షణ బాధ్యత భుజానికి ఎత్తుకున్న ఓ ఛానల్ కెమెరామెన్ ఉన్మాదంతో చెలరేగిపోతున్నాడట…. రోజూ దీక్షా స్థలానికి రావడం, అక్కడ మహిళలను దొంగ చాటుగా ఫోటోలు తీయడం, అక్కడితో ఆగకుండా ఫోన్ నంబర్లు కావాలని వారిని వేధించడం రెండు నెలలుగా ఇదే తంతు…. చివరకు ఓ యువతి భర్తకు విషయం చెప్పడంతో అతను అగ్గి మీద గుగ్గిలమై వాళ్ళ ఆఫీసు మీదకి దండెత్తడంతో క్షమాపణ చెప్పి తప్పించుకున్నారు. సదరు ఉన్మాది కెమెరామెన్ మొబైల్ లో వందల కొద్దీ రాజధాని గ్రామాల యువతులు, వివాహితల చిత్రాలు చూసి నివ్వెరపోయారట. మహిళలు ఆందోళనలు చేస్తున్న క్రమంలో ఏమరపాటుగా ఉన్న సమయంలో వారి శరీరాలను అసభ్యంగా ఫోటోలు తీసి, అగాంగం వర్ణించుకుంటూ శునకానందం పొందుతున్నట్లు గుర్తించారు.
గత రెండు నెలలుగా రాజధాని గ్రామాల ఆందోళనలను ప్రముఖంగా చూపుతున్న ఛానళ్ల రిపోర్టర్లది అదే వరుస..ఆందోళనలు మొదలైన ప్రారంభంలో అక్కడి వారితో పరిచయాలు చేసుకున్నారు. రెండు నెలలు దాటడంతో క్రమంగా అందరితో సన్నిహితం అయిపోయారు. మొదట్లో విదేశీ సిగరెట్లు, మద్యం సాయంత్రానికి అందేవి. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు అక్కడే తిష్ట వేసి అమ్మాయిల్ని వలలో వేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఏఎదో వంకతో మహిళల ఫోన్ నంబర్లు తీసుకోవడం, వారితో చనువు పెంచుకోవడంలో పోటీ పడుతున్నారంట… తమ బాధ పంచుకుంటున్నారని రాజధాని గ్రామాల మహిళలు అనుకుంటుంటే వీళ్ళ ఆలోచనలు మాత్రం నీచంగా ఉంటున్నాయి. వీళ్ళ ప్రత్యక్ష ప్రసారాల్లో తరచూ కొందరు మహిళలు కనిపించడం వెనుక రహస్యం ఇదే…. కవర్ల, గిఫ్ట్ ల స్థాయి దాటేసి కలిసొస్తే కాటేయలని కుట్రలు చేస్తున్నారీ పచ్చ మీడియా కామాంధులు.. కాగా అమరావతిలో రెండు నెలలుగా ఎల్లోమీడియా ప్రతినిధులు సాగిస్తున్న కామలీలలపై ఏపీ సెక్రటేరియట్ మీడియా గ్రూపుల్లో బాగా సర్కులేట్ అవుతుంది..ఎల్లోమీడియా ఛానళ్ల ప్రతినిధుల ఆగడాలు మితిమీరిపోవడంతో కొందరు రైతన్నలు తమ ఇంట్లో ఆడవాళ్లను అసభ్యంగా ఫోటోలు వీడియోలు తీయడమే కాకుండా లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారంట..దీంతో పోలీసులు రంగంలోకి దిగి అమరావతిలో ఎల్లోమీడియా ప్రతినిధుల కామలీలలపై ఆరా తీస్తున్నారంట..త్వరలో చంద్రబాబుకు వెలుగునిచ్చే ఓ ఛానల్ రిపోర్టర్..మరో ఛానల్ కెమెరామెన్‌ను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. చంద్రబాబును, ఎల్లోమీడియాను నమ్ముకుంటే కొంపలు, కాపురాలు కూలిపోతాయి.. అమరావతి రైతన్నలారా..జాగ్రత్త.