రేష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. అవేవీ నిలబడలేదు..
రేష్మీ ఇమేజ్న సొమ్ము చేసుకునేందుకు మరో నిర్మాత రెడీ అయ్యాడు. దీనికితోడు రష్మీ గౌతమ్ ఇప్పుడు వెండితెరపై కూడా తన అందంతో ఘాటుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతటితో ఆగక వర్గర్ సీన్స్ చేసేందుకు కూడా రేష్మీ వెనకాడటం లేదు. దీనికి కారణం దర్శక నిర్మాతలేనని అంటోంది ఈ హాట్ బ్యూటీ.
అయితే రష్మీని మాత్రం ఎక్కువగా వల్గర్ గా హాట్ గా చూపించడానికి దర్శకులు ఇష్టపడుతున్నారా? అంటే.. రష్మీ ఏ మాత్రం ఆలోచించకుండా అవును అలా ఉంటేనే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నేను హాట్ గా కనిపించడానికి ఏమి ఇబ్బందిపడను అంటూనే వల్గర్ సీన్స్ మాత్రం చేయడానికి ఇబ్బందిపడినా చేయకతప్పలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది.
సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువగా ఇలాంటి ప్రస్తావనలు వచ్చినప్పుడు మెల్లగా తెప్పించుకునే ప్రయత్నం చేస్తారు. హీరోలు కూడా వారు నటించిన సినిమాలోని మసాలా సీన్స్ గురించి అస్సలు ప్రస్తావించడానికి ఇష్టపడరు. కానీ రష్మీ మాత్రం మాస్ మసాలా ఉంటేనే ఆడియెన్స్ ఎక్కువగా ఎక్కుతోందని రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా చెప్పేసింది. అంతే కాకుండా గుంటూరు టాకీస్ లో కూడా తాను వల్గర్ గా కనిపించలేదని చెప్పుకొచ్చింది.