అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 24, 25 న ట్రంప్ ఇండియాలో పర్యటిస్తారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఎయిర్ ఫోర్స్‌వన్ విమానంలో ట్రంప్ అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు. అనంతరం మోదీ, ట్రంప్..విమానాశ్రయం నుంచి రోడ్ షో ద్వారా మొతెరా స్టేడియంకు చేరుకుంటారు. దాదాపు లక్ష మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ట్రంప్‌కు ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యలో సబర్మతి ఆశ్రమంలో ట్రంప్, మోదీలు 15 నిమిషాలు గడుపుతారు. అక్కడి నుంచి మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి మధ్యాహ్నం 12.30గంటలకు చేరుకుంటారు. ఈ కార్యక్రమం ఆ తర్వాత మధ్యాహ్నం 3.30గంటలకు ట్రంప్, మెలానియా ఆగ్రాకు బయలుదేరుతారు. ఆ రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్లో బస చేస్తారు. మరుసటి రోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా కోవింద్ ట్రంప్ గౌరవార్థా విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి కోవింద్ స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపించినట్లు సమాచారం. సీఎం కేసీఆరతోపాటు మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా, బీహార్, కర్ణాటక సీఎంలకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. మొత్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కావడం ఆసక్తికరంగా మారింది.
